జగన్ 'పిచ్చి వాగుడు'
posted on Oct 27, 2013 12:47PM
.jpg)
పదహారు నెలలు అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మానసిక స్థితి బాగోలేదు. అందుకే మతి భ్రమించిన వాడిలా పిచ్చి వాగుడు వాగుతున్నాడు. సోనియాగాంధీ మోచేతి నీళ్లు తాగి రోజు ఆమె ఇటలీ నుండి వచ్చిన సంగతి తెలియదా ? అసలు వాళ్ల నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది సోనియాగాంధీ కాదా అని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. హైదరాబాద్ సమైక్య శంఖారావం సభలో జగన్ ప్రసంగం పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు.
జగన్ కు ఓట్లు సీట్లే ముఖ్యమని, తెలంగాణ వాళ్లు చీత్కరిస్తున్నా సిగ్గులేకుండా జగన్ కలిసి ఉందామని అంటున్నాడని పొన్నం విమర్శించారు. హైదరాబాద్ లో అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకునేందుకు హైదరాబాద్ లో మీటింగ్ లు పెట్టి జగన్ సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాడని, జాతీయ గీతాన్ని అవమానించిన జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కేసులు పెట్టి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.