సోమిరెడ్డికి కిరణ్ షాక్
posted on Oct 27, 2013 12:38PM
.jpg)
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. తెలంగాణ విభజన నేపథ్యంలో క్యాబినెట్ సమావేశంతో సంబంధం లేకుండా చిత్తూరు జిల్లాకు తాగునీటి అవసరాల కొరకు ఏకంగా రూ.6 వేల కోట్లు కేటాయించుకున్నాడు. ఆర్థికశాఖ కూడా దీనికి ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయం నుండి చిత్తూరు జిల్లాకు తాగునీటి తరలించే పథకం ఇది. ఇది పూర్తయితే వందలాది గ్రామాలతో పాటు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకంలకు కూడా నీటి సమస్య ఉండదు.
అయితే కండలేరు జలాశయం నుండి కేటాయింపులు లేకున్నా ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాకు నీటిని తరలిస్తున్నారని, ఇక్కడ రైతులను ఎండబెట్టి ఎలా తరలిస్తారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని నిలదీస్తున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే అనుకోకుండా ఓ ప్రైవేటు కార్యక్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎదురయ్యారు. కనిపించిందే తడవు ముఖ్యమంత్రి సోమిరెడ్డితో చిత్తూరు జిల్లాకు నీరు తరలించొద్దని అంటున్నావు..అదే మాట మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో చెప్పించు..అప్పుడు ఆ పనులు నిలిపేస్తా అని చెప్పడంతో అవాక్కవడం సోమిరెడ్డి వంతయింది.