హిట్ ఫార్ములా తెలిసిన రైటర్ జగన్

 

ఏది ఏమైనా జగన్ ని మెచ్చుకుని తీరాలి సుమా! జనం నోళ్ళలో నానటానికి... ఏం చేయచ్చో ఆయనకి తెలిసినంత గా మన టాలీవుడ్, బాలీవుడ్ తారలకి కూడా తెలియదు. ఎక్కడ నుంచి వస్తాయో, ఎలా వస్తాయో తెలియదు కాని భలే ఐడియాలు వస్తుంటాయి జగన్ కి. What an Idea Sirji అని మెచ్చుకు తీరాలి. ఓదార్పు యాత్రలు, బస్సు యాత్రలు, పాద యాత్రలు ఇప్పటి వరకు రుచి చూసాం. జగన్ పుణ్యమా అని మరింకెన్ని యాత్రలు చూడబోతున్నామో...

 

ఇక వినతి పత్రాలకి, సభలకి, స్టేట్ మెంట్ లకి, రాజకీయ డ్రామాలకి, నిరాహార దీక్షలకు కొదవే లేదు. కారణాలు వెదికి మరి వాటిని ఎడా, పెడా వాడేసుకోవటంలో జగన్ దిట్ట. కాస్త జనాలు మర్చిపోతున్నారేమో అన్న అనుమానం వస్తే చాలు పక్కా స్క్రీన్ ప్లే డ్రామాతో రెడీ అయిపోతాడు.

 

 

 

హిట్ సినిమా ఫార్ములా జగన్ సినిమా ఫార్ములా ఒక్కటే ఈజీగా అర్దమైపోతుంటుంది. క్లైమాక్స్ ఏంటో. అయినా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెసెంట్ చేయడానికి కుటుంబమంతా కలిసి తెగ కష్టపడుతున్నారు. ఆదర్శ కుటుంబ అవార్డు ఎవన్నా వుంటే అది వైస్సార్ కుటుంబానికే దక్కుతుంది అని గట్టిగా చెప్పొచ్చు.

 

ఒకళ్ళు ప్రారంభిస్తే మరొకరు కొనసాగిస్తారు. మరొకరు క్లైమాక్స్ దాకా తెస్తే ఇంకొకరు ముగింపునిస్తారు. ఏది ఏమైనా ప్రతీ డ్రామాలో మీడియాని, జనాన్ని వీలైనంత వాడేసుకుని కావలిసినంత పబ్లిసిటీ తెచ్చుకుని ....వాపుని చూసి బలం అనుకుని సంబరపడుతున్నారు. ఫలితంతో పనిలేదు... ప్రయత్నించడమే ముఖ్యమనుకునే యోధుడు జగన్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu