పాకిస్తాన్ లో జగన్ సభ ఎలా పెడతారు?
posted on Oct 1, 2013 3:17PM

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల హైదరాబాద్ ను పాకిస్తాన్ అంటే, ఆయన ఇక్కడ సభ పెడతానంటారా అని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. రాష్ట్ర విభజన గురించి తన వద్దకు వచ్చిన జగన్ కు గవర్నర్ ఎలా కలిసేందుకు అనుమతి ఇస్తాడు ? అక్రమంగా ప్రజల సొమ్ము దోచుకుని జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన జగన్ ను కలవడం ఎలాంటి సంకేతాలు సమాజానికి ఇస్తుంది ? రేపు హత్య చేసిన వాడు కూడా వస్తే గవర్నర్ ఆహ్వానిస్తాడా ? అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ప్రశ్నించారు.
ఇంకా జగన్ మీద కేసులు విచారణలోనే ఉన్నాయని, ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదించిందని అలాంటి వ్యక్తి బెయిలు మీద బయటకు వస్తే ఆరుగంటల పాటు ఊరేగింపుగా ఇంటికి వెళ్తే పోలీసులు రక్షణ ఎలా కల్పిస్తారని వీహెచ్ ప్రశ్నించారు. రేపు హత్య చేసిన వాడు ఊరేగింపు చేస్తే ఇలాగే భద్రత ఇస్తారా ? అని ప్రశ్నించారు. జగన్ హైదరాబాద్ సభకు ముఖ్యమంత్రి అనుమతి ఇవ్వొద్దని, అనుమతి ఇస్తే తెలంగాణ వాదులు ఊరుకోరని హెచ్చరించారు.