శాసిస్తున్న జగన్ ... అమలు చేస్తున్న ద్వారంపూడి ...

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎలా చెబితే అలా ... ఆయన శాసనాలను యథాతథంగా అమలు చేసే కుటుంబం కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిది. అందుకే జగన్ చెప్పినట్లు ముందుగా తన అన్న ద్వారంపూడి వీరభద్రారెడ్డిని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి పంపించి తాను మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. రాజకీయంగా ఎదగాలంటే ఎటువంటి భావనలూ ఉండకూడదనటానికి ఎమ్మెల్యే ద్వారంపూడి ఓ గీటురాయిగా నిలుస్తున్నారు. రాజకీయంగా, వ్యాపారపరంగా వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుటుంబానికి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కుటుంబానికి సంబందాలున్నాయి. వ్యాపారం నష్టాల్లో ఉండి దారుణమైన స్థితికి దిగాజారిపోవాల్సిన సమయంలో వై.ఎస్.ఆర్. కుటుంబం ద్వారంపూడి కుటుంబాన్ని ఆదుకుంది. అందుకే కొంతకాలం బహిరంగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డితో కలిసి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో తిరిగిన ఎమ్మెల్యే ద్వారంపూడి అవిశ్వాసం సమయంలో జగన్ ను తిరిగి సలహా కోరారని తెలిసింది.

 

 

ఆయన ఇచ్చిన సలహా మేరకే కాంగ్రెస్ లోనే ద్వారంపూడి కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్నీ పత్రికాముఖంగా ప్రకటించి మరీ చంద్రశేఖరరెడ్డి కాంగ్రెస్ శ్రేణులపై పట్టుపెంచుకుంటున్నారు. మొదట్లో గ్రూపుల వారీగా తనకు ఉపయోగపడేవారినే చేరదీసిన ఎమ్మెల్యే ఇప్పుడు తనకు అవసరమున్నా లేకున్నా అందరినీ దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆయన్ని కాంగ్రెస్ శ్రేణులు నమ్మటం లేదు. ఎందుకంటే తమ కళ్ళముందే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో తిరిగి తరువాత కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నానని ప్రకటించటం కార్యకర్తలకు నచ్చటం లేదు. దీంతో ఎవరు ఏమి అడిగితే అది చేసే ధోరణికి చంద్రశేఖరరెడ్డి వచ్చారు. ఇది ఒకవైపు అయితే నాణేనికి మరోవైపు ఓ చిత్రమైన ప్రణాళికను జగన్ రూపొందించారు.

 

 

దాని ప్రకారం 2014 ఎన్నికలప్పటికి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ఫుల్ ఫామ్ లో ఉంటే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఆయన అన్న వీరభద్రారెడ్డి స్వాగతం పలుకుతారు. అదే కనుక ఫామ్ లో లేకపోతే కాంగ్రెస్ తరపున చంద్రశేఖరరెడ్డి తిరిగి టిక్కెట్టు సంపాదించుకోవచ్చు అని జగన్ ఆప్షన్ తో సూచనలిచ్చారట. దాన్ని తూ.ఛ (తుది చరణం) తప్పకుండా ఫాలో అయిపోవాలని ద్వారంపూడి సిద్ధమయ్యారు. కానీ, కాకినాడ నియోజకవర్గంలో చంద్రశేఖరరెడ్డి అంతే వ్యతిరేకత కూడా పెరిగిపోయింది. ఎమ్మెల్యే అయిన తొలినాళ్ళలో చౌకదుకాణాల కేటాయింపు వ్యవహారం వచ్చినప్పుడు మన రెడ్లు పేర్లేమైనా ఉంటే దానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని బయటపడటం వల్ల ధరఖాటుదారులు హతాశులై ఈ విషయాన్ని నియోజకవర్గం అంతా ప్రచారం చేశారు. దీంతో ఎమ్మెల్యే తన సామాజిక కులానికి ఇచ్చే ప్రాధాన్యత, జగన్ మాటకు ఇచ్చే విలువ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ చెప్పేస్తున్నారు. ఏ పాన్ షాపు దగ్గర ఆగినా ఎమ్మెల్యే జగన్ మనిషేనట కదా! అన్న కాహ్ర్చ ఇటీవల కాలంలో ఎక్కువైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu