జగన్ దీక్ష ఫ్లాప్.. ఆ నాయకుడు వల్లేనా
posted on Oct 14, 2015 6:04PM
.jpg)
ఏపీ ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన దీక్ష చేయడం వల్ల ఓరిగేందంటే కనీసం ఆపార్టీ నేతలు కూడా సమాధానం చెప్పలేరు. అసలు దీక్ష చేసి ఏం సాధించారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా జగన్ కు దీక్షలు చేయడం అలవాటుగా మారిపోయింది. అలాగే ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసి ఆఖరికి నవ్వులపాలు అవ్వాల్సి వచ్చింది.
అయితే పార్టీ శ్రేణులు మాత్రం ఇప్పుడు దీక్ష చేయోద్దని జగన్ చెప్పినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీ ప్రభుత్వంతో పాటు అటు ప్రజలు కూడా రాజకీయ శంకుస్థాపన కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నారని.. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం తరువాత దీక్ష సంగతి చూద్దాం అని చెప్పినా కూడా జగన్ దీక్షకు పూనుకున్నారట. అయితే జగన్ దీక్ష చేయడం వెనుక పార్టీలో కొత్త నాయకుడు ఉన్నాడని.. అతని ప్రోత్సాహం వల్లే జగన్ దీక్షకు పూనుకున్నారని దీక్షలో విఫలం అయ్యారని పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారట.
అంతేకాదు ఈ దీక్ష వల్ల జగన్ కు చాలా నష్టం జరిగిందని.. ఇక భవిష్యత్ లో జగన్ ఎలాంటి దీక్షలు చేస్తానన్నా ఎవరూ పట్టించుకోరని.. దీనివల్ల జగన్ కు చాలా నష్టంజరిగిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడే జగన్ అంత సీరియస్ గా దీక్ష చేస్తేనే ఏపీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. అలాంటిది ఈ ఎఫెక్ట్ వల్ల భవిష్యత్ లో చేసే దీక్షలకు కూడా విలువ ఉండదని అనుకుంటున్నారు. ఏది ఏమైనా జగన్ దీక్ష ప్లాప్ అయిందని జగన్ పార్టీ నేతలే అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు.