మూకుమ్మడి రాజీనామాలంటూ బెదిరించారట
posted on Oct 15, 2015 12:40PM

67మంది వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డారనే టాక్ వినిపిస్తోంది, జగన్ దీక్ష విషయంలో చంద్రబాబు సర్కార్ తమాషా చూడటంతో వైసీపీ నేతలు కంగారుపడ్డారని, జగన్ ఆరోగ్యం విషమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం, ఆస్పత్రికి లిఫ్ట్ చేయకపోవడంతో మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ బెదిరించారని అంటున్నారు, దీక్ష పేరుతో బాబును జగన్ ఇరకాటంలో పెడదామనుకుంటే, ప్రభుత్వం కూడా జగన్ విషయంలో గేమ్స్ ఆడిందని అంటున్నారు. దీక్ష పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని జగన్ చూస్తే, ఎన్నిరోజులు ఉంటాడో చూద్దామనే రీతిలో సర్కార్ వ్యవహరించిందంటున్నారు, ఆరోగ్యం క్షీణిస్తున్నా దీక్షను భగ్నంచేయకుండా జగన్ కు సర్కార్ చుక్కలు చూపించడంతో వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ప్రభుత్వాన్ని బెదిరించారని, దాంతో కొత్త తలనొప్పి ఎందుకని భావించి ఏడోరోజు జగన్ దీక్షను భగ్నం చేశారని చెప్పుకుంటున్నారు.