జగన్ దీక్ష.. అసలు షర్మిళ ఎక్కడ?
posted on Oct 13, 2015 5:47PM
.jpg)
గుంటూరు జిల్లా నల్లపాడులో ఏపీ ప్రత్యేక హోదా కోసం జగన్ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఈ రోజు జగన్ దీక్షను భగ్నం చేసిన సంగతి విదితమే. అయితే జగన్ దీక్షకు ఎన్నో పార్టీలు మద్దుతు తెలిపాయి.. ఎంతో మంది నేతలు వచ్చి పరామర్శించారు. అయితే ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే అసలు జగన్ దీక్ష చేస్తున్న సమయంలో జగన్ చెల్లి షర్మిళ ఎక్కడా కనిపించకపోవడం. అంత పెద్ద దీక్షను తెలపెట్టిన జగన్ కు మద్దతు పలకడానికి ఎంతో మంది నాయకులు రాగా.. తల్లి విజయమ్మ.. భార్య భారతి పక్కన ఉన్నా షర్మిళ మాత్రం జగన్ దీక్ష ప్రారంభించిన తరువాత అసలు రానేలేదు. మరోవైపు జగన్ దీక్షకు షర్మిళ రాకపోవడంపై పార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే షర్మిళ రాకపోవడానికి పలు కారణాలు చెపుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే పార్టీలో రాజేశేఖర్ రెడ్డి తరువాత జగన్.. జగన్ తరువాత షర్మిళ కు అంత ఆదారణ ఉంది కాబట్టి.. తన చెల్లెలు తనకు పోటీ అవుతుందని.. తనను డామినేట్ చేస్తుందని జగనే షర్మిళను దీక్షకు రావద్దని చెప్పారని అంటున్నారు. మరోవైపు షర్మిళ తెలంగాణలో యాత్రలు చేస్తూ బిజీగా ఉందని కొందరు అనుకుంటున్నారు. మొత్తానికి జగన్ తన చెల్లెలే తనకు పోటీగా వస్తుందని భయపడినట్టున్నారు.. అందుకే దీక్షవైపు షర్మిళ రాకుండా అడ్డుకట్టవేశారు.