జ‌గ‌న్ కి ప్ర‌జ‌ల‌ను ఓటు అడిగే నైతిక హ‌క్కు లేదు.. కేశినేని జానకి లక్ష్మి

40వ వార్డులో ఇంటింటికి ఎన్నిక‌ల ప్ర‌చారం
కేశినేని జాన‌కిల‌క్ష్మీ, సిరిపుర‌పు ధ‌న‌ల‌క్ష్మీ కి అపూర్వ స్వాగ‌తం

ఒక్క ఛాన్స్ అంటూ మాయ మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్  మాట త‌ప్పాడు. ఐదేళ్ల‌లో ద‌శ‌ల వారీగా రాష్ట్రంలో మ‌ధ్య‌పాన నిషేధం చేస్తాన్న జ‌గ‌న్ ఆ మాట మ‌ర్చిపోయాడు. ఇచ్చిన మాట‌ను తప్పిన జ‌గ‌న్ కి నైతికంగా ప్ర‌జ‌ల‌ను ఓటు అడిగే హ‌క్కులేద‌ని  తెలుగుదేశం విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్  స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ  అన్నారు. బిజెపి, జ‌న‌సేన బ‌ల‌ప‌రిచిన  విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి  కేశినేని శివనాథ్ గారు, పశ్చి  నియోజకవర్గ బిజెపిశాసనసభ అభ్యర్థి  సుజ‌నా చౌద‌రి  గార్ల  విజయాన్ని కాంక్షిస్తూ 40వ డివిజ‌న్ భ‌వానీపురంలో మంగ‌ళ‌వారం ఉద‌యం సుజనా చౌదరి గారి సోదరి సిరిపుర‌పు ధ‌న‌ల‌క్ష్మీ గారితో క‌లిసి ఇంటింటికి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జాన‌కి ల‌క్ష్మీగారు సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు వివ‌రించి ఎన్డీయే అభ్య‌ర్ధులకి ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు. 

ఈ ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మానికి  ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌ వ‌చ్చింది.  ఈ ఇంటింటికి ఎన్నిక‌ల‌ ప్ర‌చారం  ఆకుల రాజేశ్వ‌ర‌రావు మిల్ రోడ్డు, గాంధీ బొమ్మ రోడ్డు, బాలాజీ హాస్ప‌ట‌ల్ రోడ్డు, జ్యోతి కాన్వెంట్ రోడ్డు, కోపూరి వారి వీధి, హ‌నుమ‌య్య వీధి, సాయిబాబా గుడి రోడ్డు, ప్ర‌సాద్ హోట‌ల్ రోడ్డులో  సాగింది. ఈ డివిజ‌న్ లోని మ‌హిళ ఓట‌ర్లు కేశినేని జాన‌కిల‌క్ష్మీ , సిరిపుర‌పు ధ‌న‌ల‌క్ష్మీ కి మంగళ‌హార‌తులిచ్చి త‌మ మ‌ద్దతు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్బంగా కేశినేని జాన‌కి ల‌క్ష్మీగారు మాట్లాడుతూ చంద్ర‌బాబు గారు అధికారంలోకి రాగానే  త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం ద్వారా ప్ర‌తి కుటుంబంలో ఎంత‌మంది పిల్ల‌లు చ‌దువుతుంటే వారంద‌రికీ ఏడాదికి ప‌దిహేను వేలు చొప్పున అంద‌జేయ‌నున్నార‌ని తెలిపారు. రాక్ష‌స పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడి...రాష్ట్రాన్ని అభివృద్ది ప‌థంలో న‌డిపించే చంద్ర‌బాబు నాయుడ్ని ముఖ్య‌మంత్రిగా అధికారంలో తీసుకువ‌చ్చేందుకు ఎన్డీయే అభ్య‌ర్ధుల్ని గెలిపించాల‌ని కోరారు.ప‌శ్చిమ‌ నియోజ‌క‌వ‌ర్గంలో బిజెపి ఎమ్మెల్యే అభ్య‌ర్ధి సుజ‌నా చౌద‌రి గారిని భారీ మెజార్టీతో గెలిపించి....విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ధి శివ‌నాథ్ గారికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధిక మెజార్టీ అందించాల‌ని కోరారు.   

ఈ కార్య‌క్ర‌మంలో  డివిజ‌న్ పార్టీ ప్రెసిడెంట్ పి.వి.సుబ్బారావుగారు, డివిజ‌న్ పార్టీ సెక్ర‌ట‌రీ జి.గ‌ణేష్, బూత్ ఇన్చార్జ్ సురేష్‌, బూత్ ఏజెంట్స్ కె.శ్రీనువాస‌రావు, సి.హెచ్. నాగ‌రాజు, ఎమ్.నారాయ‌ణ‌, వెంక‌టేశ్వ‌ర్లు, దుర్గ‌రావు, శివాజీ, ఎమ్.ఆదినారాయ‌ణ గార్ల‌తోపాటు బిజెపి, టిడిపి, జ‌న‌సేన నాయ‌కులు కార్య‌క‌ర్తలు పాల్గొన్నారు.