నేడు జగన్‌ బెయిల్ పిటిషన్‌పై తీర్పు

 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ పిటీషన్‌పై ఇవాళ తీర్పు వెలువడనుంది. ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేశామని కోర్టుకు తెలిపిన సిబిఐ, జగన్‌ రాజకీయంగా బలమైన వ్యక్తి కనుక సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అందుకే బెయిల్‌ ఇవ్వవద్దని వాదించింది.

అయితే సిబిఐ దర్యప్తు పూర్తయినందున  బెయిల్‌ మంజూరు చేయాలని జగన్‌ తరుపు న్యాయవాది వాదించారు. ఈ నెల 18న ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్ధానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. దీంతో ఈ రోజు జగన్‌ బెయిల్‌ వస్తుందా లేదా అన్న అంశం పై
ఉత్కంట నెలకొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu