ఎప్పుడూ అదే ఏడుపా...

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టును ఎప్పుడైతే తెరపైకి తీసుకువచ్చారో అప్పటినుండి.. ఈరోజు వరకూ దానిపై ఏడుస్తూనే ఉన్నారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్. ఏదో ఈ ప్రాజెక్ట్ ద్వారానే కోట్లకి కోట్లు నొక్కేశారు అన్నట్టు మాట్లాడుతుంటారు ఎప్పుడు చూసినా. అసలు వాళ్లకి పట్టిసీమ ప్రాజెక్ట్ మీద కోపమా...లేక చంద్రబాబు మీద కోపమా.. లేక రైతుల మీద కోపమా...? వారికే తెలియాలి. ఎందకంటే ఈ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రైతులకు కలిగే లాభాలేంటో తెలిస్తే ఇలా మాట్లాడరు.

 

ఈ రోజున, కృష్ణా డెల్టా రైతులు కాని, గుంటూరు, ప్రకాశంలో కొంత లెక్క రైతులు కాని సంతోషంగా ఉన్నారు అంటే, నాలుగు ముద్దలు తింటున్నారు అంటే అది పట్టిసీం చలవే అని చెప్పొచ్చు. నాగార్జున సాగర్ నుండి ఎంత నీరు వస్తుందో... అది రైతులకు ఎలా ఉపయోగపడుతుందో కాస్త పరిజ్ఞానం ఉన్నవాళ్లకి ఎవరికైనా అర్ధమవుతుంది. అయినా ఇప్పటికీ ఇప్పటికీ పట్టిసీమ దండుగ అంటాడు జగన్. ఇప్పుడు ఆయనతో పాటు వైసీపీ నేత, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా తయారయ్యాడు. అసలు కృష్ణ, గోదావరి డెల్టా రైతుల కోసం పట్టిసీమ ద్వారా ఇంత ఖర్చు అవసరమా? అని ప్రశ్నించాడు... ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు... ఈ పట్టిసీమ అసలు ఎందుకు కట్టారో చెప్పండి అంటూ అర్ధంలేని ప్రశ్నలు వేశాడు.

 

ఇక ఈయన మాటలకు నవ్వుకోవాలో.. కోప్పడాలో కూడా తెలియటం లేదు అంటున్నారు కొంతమంది. అంతేకాదు... అయ్యా రాజేంద్ర ఆ ఖర్చు కేవలం డెల్టా రైతుల కోసమే పెట్టలేదు, దానివల్ల ఆదా అయిన నీటిని రాయలసీమ జిల్లాకే తరలించారు.... షుమారు 150 టియంసి నీరు సీమ రైతాంగంకి ఇచ్చారు అని అంటున్నారు. అంతేకాదు... మీ నాయకుడు పాదయాత్ర చేస్తున్నారు కదా. అక్కడ పచ్చని పొలాలు చూస్తుంటే కూడా అర్ధమవ్వడంలేదా..   మూడేళ్ళు అయినా, మీకు ఇప్పటికీ పట్టిసీమ అంటే ఏంటో తెలియకపోవటం దురదృష్టకరం అంటున్నారు. మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ.. ఇలా విషయం తెలుసుకోకుండా.. ఎంతసేపు ఇంతలా రైతులని ఆదుకున్న పట్టిసీమ మీద, నిత్యం ఏడుస్తూనే ఉంటే ఏం ఉపయోగం ఉండదు.