మోడీకి బాబు కట్టుకున్న పెళ్లాం.. జగన్ ఉంచుకున్న పెళ్లాం..

 

బాబు కట్టుకున్న పెళ్లాం.. జగన్ ఉంచుకున్న పెళ్లాం.. అదెంటీ అనుకుంటున్నారా...? సీపీఐ నేత రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో నిజం కూడా లేకపోలేదు. ఎందుకుంటే.. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-టీడీపీ మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే రెండు పార్టీలు మిత్ర పక్షంగా ఉన్నప్పటికీ.. ఈ రెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పొత్తుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇక ఎప్పుడు టీడీపీ పక్కకు తప్పుకుంటుందా.... ఎప్పుడు మధ్యలో దూరదామా అని వైసీపీ పార్టీ చూస్తుంది.

 

అంతేనా ఇప్పటికే వైసీపీ-బీజేపీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. గతంలో జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చి... చంద్రబాబుకు ఇవ్వనప్పుడే ఈ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నంద్యాల, కాకినాడ ఎన్నికల తరువాత బీజేపీకి ఉన్న పొగరు కాస్త దిగిపోయి...జగన్ తో పొత్తుకు కాస్త వెనుకడుగు వేసిందనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి ఏదో బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నా ఎన్నికల సమయం దగ్గరకొస్తున్న కొద్దీ ఈ స్నేహం ఎంతవరకూ ఉంటుందో తెలియని స్థితి ఉంది. దీనిపై చంద్రబాబు సడెన్ గా నిర్ణయం తీసుకునే స్థితిలో కూడా లేరు.

 

ఇక ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి కూడా ఇంచుమించు అంతే.. కేంద్రంతో సఖ్యతగా ఉందామని ఆ పార్టీ అధినేత వైఎఎస్ జగన్ మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుంచి టీడీపీ వేరయితే తాను ఆ స్థానం భర్తీ చేయాలన్న ఆలోచన కూడా వైసీపీలో కనిపిస్తోంది. అందుకే రాష్ట్రపతి ఎన్నిక వంటి వాటిలో ఏమాత్రం మొహమాటం లేకుండా బీజేపీకి మద్దతిచ్చింది. దీనికి కారణం ఆయనపై ఉన్న కేసుల నుంచి బయటపడాలని చూడటమే. ఎలాగోలా బీజేపీ మెప్పు పొందాలని కేంద్రంలో ఉన్న బీజేపీని మచ్చిక చేసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమోనన్నది ఆయన ఆలోచన.

 

ఈ క్రమంలో జగన్, చంద్రబాబు వైఖరిపై విపక్షాలు తప్పుబడుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో స్నేహం కోసం టీడీపీ, వైసీపీ ప్రయత్నిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయని సీపీఐ పార్టీ ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత రామకృష్ణ మాట్లాడుతూ....ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు కట్టుకున్న పెళ్లాంలా వ్యవహరిస్తుంటే.. వైఎస్ జగన్ ఉంచుకున్న పెళ్లాంలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకే బీజేపీతో దోస్తీకి ప్రయత్నిస్తుంటే.. ఇక చంద్రబాబును నోటుకు ఓటు కేసు భయపెడుతోందని ఆయన అన్నారు. మరి చూద్దాం ఎన్నికల సమయానికి ఎవరు ఎవరితో దోస్తీ కడతారో..? ఎవరు సింగిల్ గా బరిలోకి దిగుతారో..?