డ్రగ్స్ కేసుపై పవన్ స్పందన.. చీకటి రోజులు..
posted on Aug 3, 2017 5:37PM
.jpg)
గత కొద్ది రోజులుగా రెండు రాష్ట్రాల్లో డ్రగ్స్ వ్యవహారం పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో సినీ ప్రముఖుల హస్తం కూడా ఉందన్న వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు ఈ వ్యవహారం ఇంకా ఇంట్రస్టింగ్ గా మారింది. రోజుకో సెలబ్రిటీ సిట్ విచారణలో పాల్గొనడం.. మీడియా కూడా బాగా కవరేజ్ చేయడంతో ఏమౌతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూశారు. ఇక ఇండస్ట్రీమీద ఒక్కసారిగా వార్తలు రావడంతో పలువురు ప్రముఖులు వారికి తోచిన విధంగా స్పందించారు. ఇప్పుడు డ్రగ్స్ కేసు విషయంపై నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. కేసు విచారణ జరిగిన 10 రోజులు ఇండస్ట్రీకి చీకటి రోజులుగా వర్ణించారు. అంతేకాక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖలని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. చలన చిత్ర కూటమి తరపున మీకు అప్పీల్ చేసుకుంటున్నామని ట్వీట్ చేశాడు పవన్.
.jpg)
