తను తీసిన గోతిలో తానే పడిన జగన్

 

చెడపకురా చెడేవు అన్నారు పెద్దలు. అయితే ఈ మంచిమాటను కొంత మంది చెవులకి ఎక్కించుకోకుండా ఎదుటవారి కోసం గోతులు త్రవ్వి చివరికి అందులో తామే పడతారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మన ముందు ఒక సజీవ ఉదాహరణగా నిలిచి ఉండగా, ఈరోజు శాసనసభలో నల్లధనంపై జరిగిన చర్చలో అధికార పార్టీని ఇరుకున పెట్టబోయి జగన్మోహన్ రెడ్డి అడ్డుగా దొరికిపోయారు. జగన్, చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సమయంలో ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు వేసిన ప్రశ్నలతో కాసేపు జగన్ నోట మాట రాలేదు. యనమల ఏమ్మన్నారంటే, “ఈ సభలో ఏ ఒక్క సభ్యుడయిన జైలులో 16నెలలు గడిపి వచ్చిన వారున్నారా? ఈ సభలో రూ.1100 కోట్ల ఆస్తులు ఈ.డీ. చేత జప్తు చేయబడిన సభ్యుడు ఎవరయినా ఉన్నారా? ఈ సభలో ఎవరయినా లక్ష కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారున్నారా? ఈ సభలో ఎవరయినా సీబీఐ కోర్టులో రూ.43,000 కోట్ల అక్రమార్జనపై కేసులు ఎదుర్కొంటున్న వారున్నారా?” అని ప్రశ్నల వర్షం కురిపించేసరికి జగన్ కాసేపు బిత్తరపోయారు. గవర్నర్ ప్రసంగంపై చర్చ మొదలయిన తొలిరోజునే జగన్మోహన్ రెడ్డి అధికార పక్షం నుండి ఇటువంటి అవమానకర ప్రశ్నలను ఎదుర్కొన్నప్పటికీ, మరింత అప్రమత్తంగా మెలగకపోగా రెండవరోజు కూడా అదే దూకుడు ప్రదర్శించి నిండు సభలో అవమానం పాలయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu