తరువాత టార్గెట్ మీదే...
posted on Jun 10, 2017 10:35AM
.jpg)
ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రదాడులు తరచూ ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉన్నాయి. రోజుకి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఏకంగా హెచ్చరికలకు దిగారు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు. ఇరాన్ పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆదాడి తమ పనే అని కూడా ఇస్లామిక్ స్టేట్ ఒప్పుకుంది. ఇప్పుడు సౌదీ అరేబియాకు హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ తరువాత టార్గెట్ సౌదీనే అని.. 'మీపై దాడికి సమయం వస్తుంది' అని.. అల్లా ఆదేశం మేరకు ఇస్లాం కోసం తాము పోరాడుతున్నామని మాస్క్‌లు ధరించిన ఐదుగురు వ్యక్తులు ఒక వీడియోలో తెలిపినట్టు సైట్ ఇంటలిజెన్స్ గ్రూప్ వెల్లడించింది. దీంతో సౌదీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... ముఖ్యంగా విదేశీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.