ఐసిస్ సానుభూతిపరులకు సహాయం చేసిన వ్యక్తి అరెస్ట్..
posted on Aug 6, 2016 4:50PM

భారత్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులకు సహకరిస్తున్న వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్ట్ చేసింది. కువైట్ కు చెందిన అబ్దుల్లా హది అబ్దుల్లా రెహ్మాన్ ఎల్ ఎనిజి అనే వ్యక్తి ఉగ్రవాద సంస్ధ సానుభూతిపరులకు నిధులు ఇస్తూ సహకరిస్తున్ననేపథ్యంలో అతనిని కువైట్లో అరెస్ట్ చేశారు.
కాగా 2014లో మహారాష్ట్రకు చెందిన అరీబ్ మజీద్ అనే వ్యక్తి నలుగురు స్నేహితులతో కలిసి ఐసిస్‌లో చేరేందుకు ముంబయి నుంచి వెళ్లిపోయి తిరిగి నవంబర్‌లో భారత్‌కు వచ్చాడు. అప్పటి నుంచి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతను చెప్పిన వివరాల ప్రకారం.. తాము ఇరాక్ వెళ్లి అక్కడినుండి సిరియా వెళ్లాలనుకున్నామని.. కానీ డబ్బులు లేకపోవడంతో ఆగిపోయామని.. అప్పుడు ఎల్ ఎనిజి అనే వ్యక్తే తమకు వెయ్యి డాలర్లు ఇచ్చాడని చెప్పాడు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఎనిజిని ఆఖరికి కువైట్లో అరెస్ట్ చేశారు.