బీజేపీ, వైసీపీలు దగ్గరవుతున్నాయా? రాజధానిపై రాజీకొచ్చాయా? 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ దురాన్ని తగ్గించుకుని  దగ్గరవుతున్నాయా? ఇంతకాలం చాటు మాటుగా సాగిన స్నేహ బంధం తెరలు తొలిగిపోతున్నాయా? అంటే అనుననే సంకటాలే వస్తున్నాయి. ఓ వంక రాష్ట్ర  బీజేపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై తిరుగులేని పోరాటం చేస్తామని, చేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్నారు. ప్రకటనలు చేస్తున్నారు. ఈ,\ మధ్య కాలంలో గోసంరక్షణ, ఆలయ పరిరక్షణ విషయంగా  ఉద్యమాలు కూడా చేశారు. 

అదే సమయంలో, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన రెడ్డి వంటి కొందరు నాయకులూ వైసీపీ అనుకూల ధోరణి అవలంబిస్తున్నారని పార్టీనాయకులు, కార్యకర్తలే బహిరంగంగా ఆరోపిస్తున్నారు.  నిజానికి, ఏపీ బీజేపీ మొదటి నుంచి కూడా, రెండుగా చీలి పోయింది. ఒక వర్గం ఒక ప్రాంతీయ పార్టీకి కొమ్ముకాస్తే, మరో వర్గం మరో ప్రాతీయ పార్టీకి అనుకూల వర్గంగా చెలామణి అవుతోంది. ఒక విధంగా  ఏపీలో బీజేపీ ఎదుగుబొదుగు లేకుండా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మిగిలి పోవడానికి, పార్టీ రెండు ప్రాంతీయ పార్టీల అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలి పోవడం కూడా ఒక ప్రధాన కారణంగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వమే వైసేపీకి దగ్గర అవుతోందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. నిజానికి, 2019 ఎన్నికలకు ముందు నుంచి రెండు పార్టీల మధ్య అప్రకటిత అనుబంధం కొనసాగుతోందనేది బహిరంగ రహస్యమే. రాజ్యసభలో బిల్లుల, రాష్ట్ర్ర పతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కానీ, వైసీపీ నాయకత్వం, ‘ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్’ అన్న విధంగా కేంద్ర ప్రభుత్వానికి అవసరాలకు అనుగుణంగా సహాయం చేస్తూనే ఉంది. అలాగే, అటు నుంచి కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఎక్కడ ఆదుకోవాలో అక్కడ ఆదుకుంటోంది. అయినా, ఇంతవరకు రెండు పార్టీల మధ్య శతృమిత్ర సంబందాలు సమయానుకూలంగా మారుతున్నాయి.  

ఇక  ప్రస్తుతానికి వస్తే బీజీపీ కేంద్ర నాయకత్వం వైసీపీకి ఇంకా ఇంకా దగ్గరవుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇచ్చిన విందుకు హాజరు కావడం, ఆ తర్వాత కొద్ది రోజులకే గుంటూరులో ఒక మహిళ హత్య కేసులో విచారణ కోసం వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ బృదం, జగన్ రెడ్డి చేతుల మీదుగా శాలు కప్పించుకుని, సర్కార్ కు క్లీన్ చిట్ ఇచ్చి వెళ్ళిపోయింది. బీజేపీ రాష్ట్ర్ర పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వచ్చిన కమిషన్ సభ్యులు, కమల దళానికి జెల్ల కొట్టి, వైసీపీకి జై కొట్టి పోవడంతో బీజేపీ జాతీయ నాయకత్వం వైసీపీకి దగ్గరవుతోందనే వాదనకు మరిత్న్ బలాన్ని చేకురుస్తోంది. 

తాజగా ఏపీ రాజధాని విషయంలో  కేంద్రం ప్రభుత్వం మాట మాట మార్చింది. జగన్ రెడ్డి మాటలనే మరో భాషలో పలికింది. ఏపీ రాజధాని విశాఖ అంటూ లోక్‌సభ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏపీ రాజధానిగా వైజాగ్‌ను కేంద్రం సూచించింది. పెరిగిన పెట్రోల్‌ ధరల ప్రభావం రాష్ట్రాల్లో అంచనా వేశారా అంటూ... ఎంపీ కుంభకుడి సుధాకరన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రధాన నగరాల్లో పెరిగిన పెట్రోల్ ధరలను కేంద్రం అంచనా వేసింది. అయితే కేంద్రం విడుదల చేసిన రాజధానుల పట్టికలో ఏపీ రాజధానిగా విశాఖగా పేర్కొంది. గతంలో ఏపీ రాజధాని అంశం న్యాయపరిధిలో ఉందని చెప్పిన కేంద్ర ఇలా నాలుక మడతేయడం  ఏమిటని, జనం ప్రశ్నిస్తున్నారు. 

అయితే ఇది పొరపాటున దొర్లిన తప్పిదమా లేక  బీజేపీ, వైసీపీల  మధ్య పెరుగుతున్న స్నేహ బంధానికి మరో సంకేతమా.. అనేది తేలాల్సి వుంది. అయితే జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాల  నేపధ్యంలో బీజేపీ, ప్రాంతీయ పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి అనేది మాత్రం నిజం. ఇది అందులో భాగమా .. మరో వ్యుహమా అనేది ప్రస్తుతానికి అయితే ప్రశ్న..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu