వికటించిన ఇఫ్తార్ విందు...900 మందికి అస్వస్థత..

 

ఇరాక్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఇఫ్తార్ విందు వికటించి ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 900 మంది తీవ్ర అస్వస్ధకు గురయ్యారు. వివరాల ప్రకారం... ఇరాక్‌లోని మోసుల్ న‌గ‌రంలో రంజాన్ మాసం సంద‌ర్భంగా ఓ ప్రాంతానికి బ్రిటీష్ ఎన్జీవో ఆ ఆహారాన్ని స‌ర‌ఫ‌రా చేసింది. అయితే ఆ ఆహారం తిన్న వెంటనే అందరూ వాంతులు, విరోచ‌నాలు చేసుకున్నారు. వారిలో చిన్నారులు, మ‌హిళ‌లు కూడా ఉన్నారు. ఆ విందు ఆర‌గించిన వారందరూ డిహైడ్రేష‌న్‌కు గుర‌య్యారని అక్క‌డి అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారందరిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu