బాల్కనీ నుండి కింద పడిపోయిన పసికందు...!
posted on Jun 13, 2017 4:03PM
.jpg)
హైదరాబాద్ నగరంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ పసికందు బిల్డింగ్ బాల్కనీ నుండి కిందపోయింది. వివరాల ప్రకారం... హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతంలో ఓ 18 నెలల చిన్నారీ బాల్కనీ నుండి కిందకి పడిపోయింది. అయితే సీసీ కెమెరా దృశ్యాలను చూస్తే మాత్రం పాప అనుకోకుండా పడిపోయినట్టు కనిపించడంలేదు. బాల్కనీలోంచి ఎవరో విసిరివేసినట్లు అర్థమవుతోంది. బాల్కనీలోంచి ఆ పాప వేగంగా కిందపడిపోవడం, రోడ్డుకి మధ్యలో ఆ పాప పడిపోవడంతో ఆ పాపను ఎవరో బాల్కనీలోంచి తోసేసినట్లు బహదూర్ పుర పోలీసులు భావిస్తున్నారు. పాప తల్లిదండ్రులే ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక కింద పడిన పాపను ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన పాప ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆ పాప పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు.