ఐపిఎల్ లో కోనసాగుతున్న ఢిల్లీ జోరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఐదో ఎడిషన్‌లో ఢిల్లీ జోరు కొనసాగుతుంది. మంగళవారం జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన 43వ లీగ్ మ్యాచ్‌లో మరోసారి 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 141 పరుగులు చేసింది. 142 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ డేర్డెవిల్స్ 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 15.2 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసింది. సెహ్వాగ్ 73 పరుగులు, పీటర్సన్ 36, ఓజా11 పరుగులు చేశారు.హాగ్ 2 వికెట్లు తీసుకోగా, వాట్సన్, చవాన్ చెరో వికెట్ తీసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu