మేకపాటికి అసమ్మతి దెబ్బ
posted on May 2, 2012 9:42AM
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డికి అసమ్మతి సెగలు తగులుతున్నాయి. చంద్రశేఖరరెడ్డి ఒంటెద్దు పోకడకు నిరసనగా అనేకమంది మాజీ జెడ్.పి.టి.సి., ఎం.పి.టి.సి., ఎం,పి.పి. లు కత్తిగట్టారు. మేకపాటి వైఖరి చాలా దురహకారంగా ఉందని, బి.సి. కులానికి చెందిన వ్యక్తులను కించపరిచేలా ఆయన విమర్శలు చేస్తున్నారని వీరు ఆరోపిస్తున్నారు. మేకపాటి పార్టే కన్వీనర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదని, తమకు తోచిన విధంగా వ్యవహరిస్తూ తన వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ అసమ్మతి నేతలకు కనిగిరి మాజీ జెడ్.పి.టి.సి. చిరంజీవిరెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల ఆయన మేకపాటికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన రహస్య సమావేశానికి సుమారు 30 మంది మాజీ ప్రతినిథులు హాజరయ్యారు. దీని బలం నానాటికీ పుంజుకుండటంతో మేకపాటి కలవరపడుతున్నట్లు తెలుస్తోంది.