తెలుగోడి దెబ్బకి బేర్ మన్న బెంగళూరు

IPL 6: Mumbai Indians beat Royal Challengers by 58 runs, IPL 6: Mumbai Indians who create a storm;   defeat Royal Challengers Bangalore, Mumbai Indians crush Royal Challengers Bangalore

 

ఐపిఎల్-6 లో అద్భుతంగా రాణిస్తున్న క్రిస్ గేల్ ముంబాయి వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హర్భజన్ సింగ్ బౌలింగ్ లో తెలుగుతేజం అంబటి రాయుడు బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టడంతో 18 పరుగులకే వెనుతిరిగాడు. క్రిస్ గేల్ థాటికి 195 పరుగుల విజయలక్ష్యం చిన్నదిగా కనిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ఒపనర్లు అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చింది. డ్వేన్ స్మిత్ 36 బంతుల్లో 50 పరుగులు (4 ఫోర్లు 3సిక్సర్లు) అర్థసెంచరీ పూర్తిచేసి సయ్యద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరొక ఓపెనర్ సచిన్ టెండూల్కర్ 13 బంతుల్లో 23 పరుగులు (5 బౌండరీలు) చేసి ఆర్పీసింగ్ బౌలింగ్ లో వికెట్ల ముందు (ఎల్బీడబ్ల్యూ)దొరికిపోయాడు. దినేశ్ కార్తీక్ దూకుడుగా ఆడుతూ 33 బంతుల్లో 43 పరుగులు (3 బౌండరీలు 1సిక్సర్) రనౌట్ గా పెవిలియన్ చేరాడు. పోలార్డ్ 16 బంతుల్లో 34 పరుగులు (2 బౌండరీలు 3సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు వినయ్ కుమార్ బౌలింగ్ లో అర్జున్ రామ్ పాల్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. అంబటి రాయుడు 0 రనౌట్,  చివర్లో హర్భజన్ సింగ్ 8 బంతుల్లో 16 పరుగులు (4బౌండరీలు)ను అర్జున్ రామ్ పాల్ బౌలింగ్ లో సౌరభ్ తివారీ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు . మిచెల్ జాన్సన్ 9, మలింగ 0 నాటౌట్ గా నిలవడంతో ముంబై ఇండియన్స్ నిర్నాట 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఆర్పీసింగ్, అర్జున్ రామ్ పాల్, వినయ్ కుమార్, సయ్యద్ లకు ఒకొక్క వికెట్ దక్కింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఏ పరిస్థితుల్లోనూ టార్గెట్ ఛేజ్ చేయలేకపోయింది. క్రిస్ గేల్ అవుటవడంతో సగం వికెట్లు కోల్పోయినట్టు అయ్యింది. బెంగళూరు బ్యాట్స్ మెన్ ఒకరివెనుక ఒకరు పెవిలియన్ దారి పట్టారు. దిల్షాన్ 13 ధావల్ బౌలింగ్ లో జాన్సన్ క్యాచ్ పట్టడంతో, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 1 ధావల్ బౌలింగ్ లో దినేశ్ కార్తీక్ కి క్యాచ్ ఇచ్చి, డివిలియర్స్ 2 ధావల్ బౌలింగ్ లో దినేశ్ కార్తీక్ కి క్యాచ్ యిచ్చి, అరుణ్ కార్తీక్ 12 స్మిత్ బౌలింగ్ లో స్టంపౌట్, సయ్యద్ మహమ్మద్ 9 స్మిత్ బౌలింగ్ లో జాన్సన్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యారు. సౌరభ్ తివారీ 21 స్మిత్ బౌలింగ్ లో హర్భజన్ సింగ్ క్యాచ్ పట్టడంతో, రవి రామ్ పాల్ 18 బంతుల్లో 23 పరుగులు (4 బౌండరీలు) నాటౌట్, వినయ్ కుమార్ 20 బంతుల్లో 26 పరుగులు (4 బౌండరీలు) నాటౌట్ పోరాడినా లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేసి ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది. ధావల్ కులకర్ణి 3, హర్భజన్ 2, డ్వేన్ స్మిత్ 2 వికెట్లు పడగొట్టారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లో దూకుడుగా ఆడి 50 పరుగులు, బెంగళూరు ఇన్నింగ్స్ లో రెండు కీలక వికెట్లు పడగొట్టిన డ్వేన్ స్మిత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu