డిసెంబర్ కల్లా అమెరికానే దాటబోతున్న భారత్

 

ప్రపంచ జనాభాలో చైనా మొదటి స్థానం తరువాత భారత్ రెండో స్థానంలో ఉంది.. ఇది అందరికి తెలిసిన సంగతే. ఇప్పుడు ఇంకో విషయంలో కూడా భారత్, చైనా తరువాత స్థానాన్ని పొందబోతుందని.. అది ఎంతో దూరంలో లేదని తెలుస్తోంది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా.. ఇంటర్నెట్ వినియోగంలో. ఇప్పటికే మనదేశంలో ఇంటర్నెట్ వినియోగం చాలా పెరిగిపోయింది. పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యలయాల దగ్గరనుండి ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ వినియోగించడం. అందునా ఇంటర్నెట్ సౌకర్యాన్ని మరింత చవగ్గా అందుబాటులోకి తెస్తుండటంతో మన దేశంలో ఇంటర్నెట్ వినియోగం చాలా వేగంగా పెరుగుతోంది. దీంతో వచ్చే డిసెంబర్ లోగా ఇంటర్నెట్ వినియోగంలో అగ్రరాజ్యమైన అమెరికాను సైతం మనం దేశం బీట్ చేయోచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో 37.5 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. డిసెంబరు నెలాఖరుకు ఈ సంఖ్య 40 కోట్లు దాటొచ్చని సమాచారం. ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగంలో చైనా మొదటిస్థానంలో ఉండగా అమెరికా రెండో స్థానం.. భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. మొత్తానికి అభివృద్ధిలో కాకపోయిన ఈ విషయంలో అయినా అమెరికాని దాటగలిగాం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu