కరుణానిధి తెలుగుబిడ్డే..!
posted on Jun 3, 2017 10:42AM

తమిళరాజకీయాల్లో కురువృద్దుడు డీఎంకే అధినేత కరుణానిధి చెరగని ముద్ర వేశారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 60 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ప్రయాణించారు కరుణానిధి. అలాంటి కరుడుగట్టిన రాజకీయ నేత అయిన కరుణానిధి మూలాలు మాత్రం మన తెలుగు గడ్డవే అంటే ఆశ్చర్యపోవాల్సిందే. వివరాల ప్రకారం..కరుణానిధి పూర్వీకులది ప్రకాశం జిల్లా. కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. 1924లో తంజావూరు జిల్లా తిరుక్కువలై గ్రామంలో ముత్తువేల్, అంజుగం దంపతులకు ఆయన జన్మించారు. 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న కరుణకు... సాహిత్యమంటే ప్రాణం. ఉద్యమాలంటే మరీ ఇష్టం. మూఢ విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకి అయిన కరుణ... ప్రజల్లో అవగాహన కలిగించేందుకు రకరకాల నాటికలు వేసేవారు. కాగా ఎమ్మెల్యేగా 60 ఏళ్లను కరుణ పూర్తి చేసుకున్నారు.