ఛాన్స్ కొట్టేసిన క్రికెటర్లు

 

భారత క్రికెటర్లు మంచి ఛాన్సే కొట్టేశారు. ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ కు చేరిన భారత జట్టును సంతోషపరిచే నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకొంది. ఇప్పటి వరకు ఆటగాళ్లతో పాటు వారి భార్యలు గర్ల్ ఫ్రెండ్స్ ను అనుమతించని బీసీసీఐ ఇప్పుడు ఈ నిబంధనను మార్చింది. నాకౌట్ దశలో వారిని తమ వెంట ఉంచేందుకు అనుమతించింది. ఇకపై భారత క్రికెటర్లు ప్రపంచకప్ సమయంలో వారి భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి ఉండే అవకాశం ఉంది. అయితే శిఖర్ ధావన్ ఇప్పటికే తన భార్యతో కలిసి మెల్బోర్న్ వీధుల్లో షాపింగ్ చేస్తూ కనిపించడం విశేషం. అందరి సంగతి ఏమో కానీ ఈ న్యూస్ వల్ల విరాట్ కోహ్లి మాత్రం చాలా హ్యాపీగా ఉండొచ్చు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu