తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్
posted on May 27, 2025 4:47PM

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే భద్రతకు కీలకమైన "కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే పరిశోధన సంస్థను ఏర్పాటు చేయడానికి రూ.265 కోట్లు మంజూరు చేసింది. ఈ సెంటర్ ఇండియన్ రైల్వేలో రైళ్ల భద్రతను మెరుగుపరిచేందుకు "కవచ్" అనే స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. కవచ్ అంటే ఒక ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఇది రైళ్లు ఢీకొనకుండా, సిగ్నల్‌లను దాటకుండా, డ్రైవర్ పొరపాటు చేసినా ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వేసేలా చేస్తుంది.
ఈ సెంటర్ ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్‌లోని ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌లో పని మొదలు పెట్టింది. ఇండియన్ రైల్వే భద్రత విషయంలో ప్రపంచ స్థాయి టెక్నాలజీని అభివృద్ధి చేయడం, 5G టెక్నాలజీని పరీక్ష నెపుణ్య అభివృద్ధి, స్మార్ట్ రైలు వ్యవస్థలను రూపొందించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఐఐటీ మద్రాస్‌తో కలిసి ఈ సెంటర్ పనిచేయనుంది.