తాడిపత్రిలో హైటెన్షన్..పెద్దారెడ్డి అరెస్ట్
posted on Jun 29, 2025 11:35AM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు ఏడాది కాలం తర్వాత పెద్దారెడ్డి సొంత ఇంటికి చేరుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు తాడిపత్రి ఇంట్లో ఉండరాదంటూ విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దారెడ్డి.. నా ఇంట్లో నేను ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. దీంతో చేసేదేంలేక పెద్దారెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
ప్రస్తుతం పెద్దిరెడ్డిని రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. మరోవైపు.. హైకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ స్థానిక ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాకను పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండానికి వీల్లేదని.. గతంలోవైసీపీ హయాంలో పెద్దారెడ్డి తన ఇంట్లోకి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చేశారని, తాడిపత్రిలో సమస్యలకు పెద్దారెడ్డే కారణమని జేసీ ఆరోపించారు.
తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశముందని ఆయన అన్నారు.గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పెద్దారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను గెలిచినా, ఓడినా తాడిపత్రిలో ఫ్యాక్షనిజం చేస్తానని చెప్పారు. దీంతో తెలుగు దేశం పార్టీలు నేతలు గత కొంత కాలంగా ఆయన్ను తాడిపత్రికి రాకుండా అడ్డుకుంటున్నారు. తాజాగా ఆదివారం కూడా ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.