తాజా సర్వే.. ఏపీలో సీన్ రివర్స్!!
posted on Mar 11, 2019 5:12PM

అసలే ఎన్నికల షెడ్యూల్ విడుదలై దేశవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది అనుకుంటుంటే.. తాజాగా ఒక సర్వే ఏపీలో రాజకీయం మరింత వేడెక్కేలా చేసింది. జాతీయ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్ సంస్థ సంయుక్తంగా విడుదల చేసిన సర్వే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో ఉన్న 25 ఎంపీ స్థానాల్లో టీడీపీదే ఆధిక్యమని ఈ సర్వే పేర్కొంది. 25 ఎంపీ స్థానాలకు గానూ.. టీడీపీ 14 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. వైసీపీకి 11 స్థానాలు దక్కుతాయని తెలిపింది. కాంగ్రెస్‌కు, బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కూడా దక్కదని సర్వే తెలిపింది. అయితే.. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. ఇదే సర్వే సంస్థ.. నవంబర్ లో నిర్వహించిన సర్వేలో వైసీపీకి 20 స్థానాలు, టీడీపీకి 5 స్థానాలు.. జనవరిలో నిర్వహించిన సర్వేలో వైసీపీకి 19 స్థానాలు, టీడీపీకి 6 స్థానాలు వస్తాయని పేర్కొంది. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ సర్వే ఫలితాలు గతానికి పూర్తి భిన్నంగా రావడం విశేషం.