ఇళయరాజాకు అస్వస్థత

 

ప్రముఖ సంగీత దర్శకుడు, 72 సంవత్సరాల వయసున్న ఇళయరాజా అస్వస్థతకు గురయ్యారు. రెండు సంవత్సరాల క్రితం స్వల్పంగా గుండెపోటుకు గురైన ఆయన ఆ తర్వాత కోలుకుని సంగీత దర్శకుడిగా ఉత్సాహంగానే పనిచేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన ఆయన తనకు కడుపులో నొప్పిగా వుందని చెప్పడంతో ఆయనను బంధువులు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన గ్యాస్టిక్ సమస్యతోపాటు, పేగులోకి రక్తం చేరిన సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది. అయితే ఇది స్వల్ప అస్వస్థతేనని, ఆయనను రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రివర్గాలు ప్రకటించాయి. ఇళయరాజా మూడు దశాబ్దాలకు పైగా అనేక భారతీయ భాషల్లో ఐదు వేల పాటలకు పైగా సంగీతాన్ని సమకూర్చడంతోపాటు జాతీయ అవార్డును కూడా అందుకున్న విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu