మరో ర్యాగింగ్ కలకలం

 

ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ర్యాగింగ్ కలకలం తరచుగా జరుగుతోంది. నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న తర్వాత విద్యా సంస్థల యాజమాన్యాలు ర్యాగింగ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తు్న్నాయి. అయినప్పటికీ ర్యాగింగ్ ఆగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ర్యాగింగ్‌కి పాల్పడిన ఒక యువతి ప్రిన్సిపాల్ మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం కూడా జరిగింది. ఏపీ విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ని ఉక్కుపాదంతో అణచివేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో ర్యాగింగ్ ఉదంతం కలకలం రేపింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉదంతం జరిగింది. ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థుల మీద సీనియర్లు ర్యాగింగ్‌కి పాల్పడినట్టు తెలుస్తోంది. ర్యాగింగ్‌కి పాల్పడిన విద్యార్థుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu