రెండు విమానాలు ఢీ

 

అమెరికాలో రెండు విమానాలు ఢీకొన్నాయి. అమెరికాలోని శాండియాగో కౌంటీలో ఈ ప్రమాదం జరిగింది. రెండు చిన్న విమానాలు ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు మరణించినట్టు తెలుస్తోంది. రెండు ఇంజన్లు వుండే సాబ్రిలైనర్జెట్, ఒకే ఇంజన్ వుండే సెస్‌న్నా 172 విమానాలు బ్రౌన్‌ఫీల్డ్ ప్రాంతానికి సమీపంలో ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. రెండు విమానాల శకలాలూ పొలాల్లో ఒకేచోట పడిపోయాయి. ఇటీవలి కాలంలో అమెరికాలో ఇలాంటి చిన్న విమానాల ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఇదిలా వుండగా, ఇండోనేసియాలో ఆదివారం నాడు 54 మంది ప్రయాణికులతో అదృశ్యమైన విమానం కూలిపోయినట్టుగా భావిస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న అందరూ చనిపోయి వుంటారని అనుమానిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu