లండన్‌లో ఉగ్రదాడులు..టీమిండియాకు భారీ భద్రత

బ్రిటన్ రాజధాని లండన్‌లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో యూకే పోలీసులు దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ భారత్-పాక్ మ్యాచ్ జరుగనుండటంతో బర్మింగ్‌హామ్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరు జట్లకు..ముఖ్యంగా టీమిండియా బస చేసిన హయత్ రీజెన్సీ హోటల్‌ను పూర్తిగా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. బయటవారిని లోపలికి అనుమతించడం లేదు. స్టేడియానికి చేరుకునేముందు టీమిండియా ప్రయాణించే మార్గంలో రాకపోకలు నిషేధించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu