అఖిలపక్షానికి వైసీపీ డుమ్మా
posted on Dec 9, 2014 3:11PM

హైదరాబాద్ నగరానికి సంబంధించిన పలు అంశాల మీద చర్చించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటయింది. హైదరాబాద్ నగరానికి సంబంధించిన అనేక అంశాలపై సమావేశంలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మెట్రో రైలు మీద కూడా చర్చజరిగే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. మెట్రో రైలు మార్గం మీద చర్చిస్తారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున సురేష్ రెడ్డి, భట్టి విక్రమార్క, నిరంజన్, ఎంఎస్ ప్రభాకర్, రామ్మోహన్ రెడ్డి, తెలుగుదశం తరఫున ఎర్రబెల్లి దయాకరరావు, రమణ, నర్సారెడ్డి, బీజేపీ తరఫున కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్, సీపీఐ తరఫున సున్నం రాజయ్య హాజరయ్యారు. ఈ అఖిల పక్ష భేటీకి వైసీపీ హాజరు కాలేదు.