చంద్రబాబుకు జగన్ లేఖ

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ లేఖ రాశారు. ప్రభుత్వ ఆదాయం, వ్యయం లెక్కలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. బడ్జెట్‌ని కూడా ఇంటర్నెట్‌లో పెట్టాలని ఆయన సూచించారు. బడ్జెట్ లెక్కల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న పద్ధతినే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుసరించాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ పద్ధతిని అనుసరించడం వల్ల పారదర్శక పాలన వుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఆదాయ వ్యయాలు, పన్నులు, లోటు ఇలా అన్ని విషయాలో ఇంటర్నెట్‌లో పెట్టాలని జగన్ సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu