కూల్చివేతలకు ఇక హైడ్రా విరామం

గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాలను నేలకూలుస్తున్న హైడ్రా స్పీడ్ తగ్గించింది. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అనతికాలంలో ప్రజాభిమానాన్ని చూరగొంది. కాంగ్రెస్ కు బద్ద శత్రువైన  బిజెపి కూడా హైడ్రా కూల్చివేతలకు సంఘీభావం తెలిపింది. పేద, బడుగు ప్రజల ఇళ్లను కూల్చొద్దని ఒక స్టేట్ మెంట్ తప్పితే పెద్దగా ప్రతిఘటించిన సందర్భం లేనే లేదు. 
హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలను తొలగించే సాహసాన్ని ప్రజలు కీర్తించారు.  మజ్లిస్ పార్టీకి చెందిన ఫాతిమా కాలేజి కూల్చివేతకు ‘హైడ్రా’ రంగం సిద్దం చేసింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా రేవంత్ సర్కార్ వెనకడుగు వేసింది. ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉంటే కాలేజి యాజమాన్యాలే  కూల్చివేయాలని  హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు.  ప్రస్తుతం కూల్చివేతలను  హైడ్రా పూర్తిగా ఆపింది. ఇప్పటికే పలు అక్రమ కట్టడాలను గుర్తించినప్పటికీ వాటిని తొలగించే పనిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు హైడ్రా చీఫ్ రంగనాథ్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునగడం వల్ల ప్రజల సహాయక చర్యల కోసం  వేచి చూస్తున్నారు.  వర్షాలు తగ్గుముఖం పడితే హైడ్రా పనులు పునరుద్దరణ జరుగుతాయి. ముంపు ప్రాంతాలను రంగనాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఇక ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ లలోని అక్రమ కట్టడాలకు ఇరిగేషన్, రెవెన్యూ, మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. వారం రోజుల్లోగా ఇళ్లు ఖాళీ చేయాలని రంగనాథ్  హెచ్చరించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu