మెట్రో పనుల్లో అపశ్రుతి

 

హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న మెట్రో పనుల్లో గురువారం నాడు చిన్న అపశ్రుతి దొర్లింది. ఒక వ్యక్తి తన కారులో అమీర్ పేట నుంచి కూకట్ పల్లికి వెళ్తుండగా సంజీవరెడ్డి నగర్ దగ్గర జరుగుతున్న మెట్రో పిల్లర్ మీద నుంచి ఒక ఇనుప కడ్డీ జారి కిందపడింది. ఆ ఇనుపకడ్డీ ఆ వ్యక్తి కారు అద్దంలోంచి లోపలకి దూసుకుని వెళ్ళి కారు నడుపుతున్న వ్యక్తి తగిలింది. దాంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే మెట్రో నిర్మాణ సంస్థ స్పందించలేదని బాధితుడు తెలిపారు. ప్రమాదం జరిగిన గంట తర్వాత అధికారులు వచ్చి తన కారుకు మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారని బాధితుడు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu