మెడికల్ కాలేజ్ గంజాయి కేసులో కొత్త కోణం

 

మెడిసిటీ మెడికల్ కాలేజ్ గంజాయి  కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. మూడు ఏళ్ల నుంచి వైద్య  విద్యార్థులు గంజాయి వాడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వంద మంది జూడాలు గంజాయి వాడినట్లు ఈగల్ టీం గుర్తించింది. ఏడాది కాలం నుంచి 32 మెడికోలు మంది వరుసగా గంజాయి తీసుకున్నట్లు ఈగల్ అధికారులు తెలిపారు. గంజాయి కోసం క్యాంపస్ వదిలి సికింద్రాబాద్ వచ్చి జూనియర్ డాక్టర్లు  తీసుకుంటున్నరని తెలుస్తోంది. జూనియర్‌లకు గంజాయి అలవాటు చేసి సీనియర్లు తెప్పించుకుంటున్నరు. మెడికోలకు గంజాయి అమ్ముతున్న డ్రగ్ పెడ్లర్ అరాఫత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

బీదర్ కు చెందిన జరీనా నుంచి అరాఫత్   గంజాయి కొనుగోలు చేస్తున్నడగా జరీనాని ఈగల్ టీం అరెస్టు చేశారు. ఏడాది కాలంలో కోటిన్నర రూపాయలను జరీనా  గంజాయి అమ్మి సంపాదించిరని తెలుస్తోంది.హైదరాబాదులో జరీనాకు 51 మంది సభ్యుల గల ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 51 మంది డ్రగ్ పెడ్డర్ల నియమించుకొని  జరీనా  గంజాయి దందా చేస్తున్నారు. ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల విద్యార్థుల టార్గెట్ గానీ గంజాయి విక్రయాలు కొనసాగిస్తున్నారు.మొత్తం 82 మంది గంజాయి వినియోగదారులను గుర్తించగా, వారిలో మెడిసిటీ మెడికల్ కాలేజీకి చెందిన 32 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 24 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా, ఇద్దరు అమ్మాయిలు సహా తొమ్మిది మందికి పాజిటివ్ అని తేలింది. 

వీరంతా కళాశాల హాస్టల్‌లోనే ఉంటున్నారు. ఈగల్ అధికారులు కళాశాల యాజమాన్యంతో కలిసి విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన తొమ్మిది మందిని డీ-అడిక్షన్ కేంద్రానికి పంపించారు. జరీనా బాను 2010 నుంచి డ్రగ్స్ అక్రమ రవాణాలో పాలుపంచుకుంటోందని పోలీసులు తెలిపారు. ఈమెపై ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నాయి. ఈమె బ్యాంకు ఖాతాలో రూ.1.5 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఇందులో రూ.26 లక్షలు హైదరాబాద్‌లోని 51 మంది పెడ్లర్ల నుంచి వచ్చాయి. ఈమె మహారాష్ట్ర, కర్ణాటకలోని బీదర్ ప్రాంతాల నుంచి గంజాయి తెస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu