రామాంతపూర్ ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య...పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
posted on Aug 18, 2025 2:29PM
.webp)
హైదరాబాద్ రామాంతపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మృతి చెందిన వారి బాధిత కుటుంబాలు స్ధానికులు ధర్నా నిర్వహించారు.మెయిన్ రోడ్డుపై ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటన స్ధానికి చేరకోని పరిస్ధితి ఆదుపులోకి ప్రయత్నం చేస్తున్నారు. గోకుల్ నగర్‌లో విద్యుత్ శాఖ సీఎండీ ముషారాష్‌కు నిరసన సెగ తలిగింది.ఎక్కువ కేబుల్స్ కటింగ్ చేస్తున్నారని అవసరం లేని వైర్లు తొలిగిస్తామన్నారు.
దాని వల్లే విద్యుత్ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఇంకా అలాంటి వైర్లు లేకుండా చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామాంతపూర్ ప్రమాద మృతులకు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అందుకు సంబంధించి త్వరలోనే చెక్‌లను పంపిణీ చేస్తామని, గాయపడిన వారికి వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇవాళ ఆయన గాయపడిన వారిని పరామర్శించేందుకు గాంధీ ఆసుపత్రికి వెళ్లారు.