విషం తాగించి భార్యని చంపేశాడు

 

ఆడవాళ్లకు బయట మాత్రమే కాదు ఇంట్లో కూడా రక్షణ లేదని నిరూపించబడింది. ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం, పడమట నర్సాపురం గ్రామంలో ఓ దారుణం చోటుచేసుకొంది. వివరాల ప్రకారం బూరుగు నర్సమ్మ(32), ముక్తేశ్వరరావు భార్యాభర్తలు. బుధవారం రాత్రి ముక్తేశ్వరరావు తాగి తన భార్యను కొట్టి ఆపై నోట్లో పురుగుల మందు పోశాడు. దీంతో కొన ఊపిరితో ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమె గురువారం చికిత్స పొందుతూ మరణించింది. నర్సమ్మ మరణంతో ఆగ్రహించిన ఆమె బంధువులు ముక్తేశ్వరరావును చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu