పీఓకేలో 42 ఉగ్ర లాంచ్ ప్యాడ్స్!

పాక్ భారత్ లోకి ఉగ్రవాదుల చొరబాట్లకు అన్ని రకాలుగా సహాయపడుతోందన్నడానికి మరో తిరుగులేని ఆధారాన్ని భారత భద్రతా దళాలు కనిపెట్టాయి. పాక్  ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ద్వారా ఉగ్రవాదులను భారత్ లోకి పంపి విధ్వంసం, హింసా సృష్టించేందుకు పాకిస్థాన్ చేస్తున్న కుట్రలను భద్రతా బలగాలు వెలుగులోకి తీసుకువచ్చాయి. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి, వారిని భారత్ లోకి పంపించేందకు పాకిస్థాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఏకంగా 42 లాంచ్ ప్యాడ్లను సిద్ధం చేసింది.

ఈ లాంచ్ ప్యాడ్ లను గుర్తించిన భారత భద్రతా బలగాలు.. అక్కడ నుంచి భారత్ లోకి చొరబడేందుకు దాదాపు 130 మంది ఉగ్రవాదులు రెడీగా ఉన్నాయని గుర్తించారు. ఈ ఉగ్రవాదులంతా పై నుంచి? ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారని భద్రతా దళాలు పేర్కొన్నారు. భారత్ లోకి చొరబడి విధ్వంసం సృష్టించడమే వీరి లక్ష్యమని తెలుస్తోంది. అలాగే హిజ్బుల్ ముజాహిదీన్, జైషేమహ్మద్, లష్కరే తొయిబా ఉగ్ర సంస్థలకు చెందిన 60 మంది ఉగ్రవాదులు, వారికి తోడుగా స్థానిక టెర్రరిస్టులు పాకిస్థాన్ లో యాక్టివ్ గా ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu