ఏపీ పోలీసుల హౌస్ క్వారంటైన్ యాప్ 

సరికొత్త అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు

ఒక్కరోజులోనే హౌస్  క్వారంటైన్ అప్లికేషన్ లో విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఐదు వేల మంది వివరాలను ఆంధ్ర ప్రదేశ్ పొందుపరిచారు. మరో 24 గంటల్లో 20 వేల మంది వివరాలను నమోదు చేయనున్న పోలీసులు. అప్లికేషన్ లో నమోదైన వివరాలు జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేసి, వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టనున్నట్టు డీ జీ పీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. ఇంటి నుండి 50 మీటర్ల జియో ట్యాగింగ్ పరిధి దాటి బయటకు వస్తే తక్షణమే పోలీస్ కంట్రోల్ కు ఆటో మ్యాటిక్ గా సమాచారం అందుతుంది. 
నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకునే విధంగా పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇది ఒక రకంగా విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన వారికి లక్ష్మణరేఖ గా భావించవచ్చునాని సవాంగ్ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu