ఒకరు విధ్వంసకుడు..మరొకరు రక్షకుడు
posted on Sep 12, 2016 8:26PM

బుర్హాన్‌వానీ..ఈ పేరు దాదాపుగా రెండు నెలలుగా దేశంలోని ప్రతీ ఒక్కరి నోటా నానుతున్న పేరు. కాశ్మీర్‌ను పాక్‌లో కలపాలనే ఉద్యమానికి ఆకర్షితుడై అనేక మంది కశ్మీర్ యువతను సోషల్ మీడియా ద్వారా మిలిటెంట్లుగా మార్చిన వ్యక్తి. అతని కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తుండగా కొద్ది రోజుల క్రితం ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతని మరణంతో కశ్మీర్ లోయ గత రెండు నెలలుగా రావణకాష్టంలా రగులుతోంది. ఉగ్రవాదంతో నరమేధం సృష్టించిన బుర్హాన్ వానీ పుట్టిన కశ్మీర్ లోయలోనే మరో వానీ వెలుగులోకి వచ్చాడు. అయితే ఆ వానీ ఈ వానీలా ఉగ్రవాది కాదు..దేశ రక్షణలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న బీఎస్‌ఎఫ్ కమాండర్‌గా. కశ్మీర్ లోయ లోని ఉద్దంపూర్‌కు చెందిన నబీల్ అహ్మద్ వనీ బీఎస్ఎఫ్ నిర్వహించిన అర్హత పరీక్షలో టాపర్‌గా నిలిచి అసిస్టెంట్ కమాండెంట్‌గా బాధ్యతలు చేపట్టాడు.

ఈ సందర్భంగా వనీ ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశాడు. దేశ రక్షణకు కాశ్మీర్ యువత ముందుకు రావటం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా వనీ మాట్లాడుతూ బీఎస్ఎఫ్ టాపర్‌గా నిలవటం సంతోషంగా ఉందని..నేను కశ్మీర్ యువతకు ఒక్కటే చెబుతున్నా..దేశ పరిస్ధితిని మార్చడం పెన్నుతోనే సాధ్యమవుతుంది తప్ప గన్నుతో సాధ్యం కాదన్నారు. బుర్హాన్ వనీని చంపినందుకు ఆగ్రహంతో రగిలిపోయిన కాశ్మీర్ యువత మరి ఈ వనీ సాధించిన విజయం నుంచైనా స్పూర్తి పొందాలని కోరుకుందాం.