హైటెక్ హంగులతో పోటా పోటీ ప్రచారం
posted on May 28, 2012 2:07PM
నెల్లూరు పార్లమెంటరీ స్థానంలో కాంగ్రెస్, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు హైటెక్ హంగులతో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థిగా మేకపాటి రాజమోహన రెడ్డి రంగంలో ఉన్నారు. వీరిద్దరిలో తిక్కవరపు ఓ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, రాజకీయానుభవం ఉన్న వ్యక్తి. ఇటీవల ఆయనను నెల్లూరు లలితకళాతోరణంలకో సినీతారలందరూ సత్కరించారు. ఆ కార్యక్రమాన్ని డిజిటల్ స్క్రీనుపై ప్రసారం చేస్తూ నెల్లూరు నగరమంతా తిరుగుతున్నారు. అప్పుడు తారలు పొగడ్తలతో సుబ్బిరామిరెడ్డిని ముంచెత్తారు. ఈ ప్రచారం ఆయన పర్యటనలో బాగా ఉపయోగపడుతోంది. ఇక మేకపాటి రాజమోహన రెడ్డి తాజామాజీ. ఈయన తమ అధినేత జగన్ ప్రసంగాలూ, ఆయనపై కుట్ర జరుగుతోందంటూ రూపొందించిన వీడియో సి.డి.లను ప్రతి గ్రామంలో ప్రదర్శిస్తున్నారు. పార్టీ ప్లీనరీ సమావేశం వంటి పలు అంశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు పార్టీలు చేస్తున్న హైటెక్ ప్రచారాన్ని ఓటర్లు ఆసక్తిగా చూస్తున్నారు.