కర్నూలు నుంచి ఐదో ఎమ్మెల్యే..సైకిలెక్కిన ఎస్వీమోహన్ రెడ్డి

కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహన్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. కర్నూలు వీజేఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన తెలుగుదేశంలో చేరారు. చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మోహన్ రెడ్డి చేరికతో కర్నూలు జిల్లా నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకి చేరింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu