హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య ...
posted on Feb 17, 2021 4:14PM
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కారులో సొంత గ్రామానికి వచ్చి హైదరాబాద్ తిరిగి వెళ్తున్న హైకోర్టు న్యాయవాది గట్టు వామన్‌రావు, అయన భార్య నాగమణిలు దారుణ హత్యకు గురయ్యారు. ఆ దంపతులిద్దరిని కారు ఆపి మరీ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. భర్తను కాపాడేందుకు అడ్డు వెళ్ళిన ఆయన భార్య నాగమణిపైన కూడా దుండుగులు దాడి చేయడంతో ఆమె కూడా మరణించారు. మంథని నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారులోనే విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు దుండగులు. హత్యకు గురైన లాయర్ వామనరావుది మంథని మండలం గుంజపడుగు స్వగ్రామం. అయన తమ గ్రామానికి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ ఘోరం జరిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.