బీజేపీ మంత్రి పై దాడి.. 

వివాదాల మధ్య విమర్శల మధ్య, ఘర్షణల మధ్య దేశంలో  5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికలు అన్ని రాష్ట్రలో ఒక ఎత్తు  అయితే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమత బెనర్జీ ఒక వైపు, బెంగాల్ బీజేపీ నాయకత్వం, కేంద్ర బీజేపీ పెద్ద తలకాయలు ఒక వైపు. బెంగాల్ మాది అంటే మాదని గొప్పలు చెప్పుకున్నారు. చివరికి బెంగాల్ ప్రజలు మమతేకే పట్టం కట్టారు. 

ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అయినా బెంగాల్ నిత్యం ఏదో ఒక చోట హింసకాండ కొనసాగుతుంది. ఎన్నికల సమయం లో సహజంగానే ఏ రాష్ట్రము లో నైనా ఇరుపక్షాల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కానీ బెంగాల్ లో మాత్రం ఎన్నికలు ముగిశాక కూడా దాడులు జరగడం ఆందోళన కలిగిస్తుంది అక్కడి స్థానికులను.   దాడులు అంటే ఏ కార్యకర్త్య పైనో, గల్లీ లీడర్ పైనో కాదు, ఏకంగా ఢిల్లీ నాయకులపైనే జరుగుతుండడడం గమనార్హం. తాజాగా బెంగాల్ లో కేంద్రమంత్రి మురళీధరన్ కారుపై దాడి జరిగింది. కొందరు వ్యక్తలు కర్రలు, రాళ్లతో మంత్రి ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. పశ్చిమ మిడ్నాపూర్ లోని పంచక్కుడిలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో కేంద్రమంత్రి మురళీధరన్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

ఈ దాడిలో తన వ్యక్తిగత సిబ్బందికి గాయాలు అయ్యాయని మురళీధరన్ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే తనపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తన వాహనంపై దాడికి సంబంధించిన వీడియోను కూడా పంచుకున్నారు. కాగా, బెంగాల్ లో హింసాత్మక ఘటనలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వరుసగా హింస చోటుచేసుకోవడం పట్ల బెంగాల్ గవర్నర్ నుంచి కేంద్రం నివేదిక కోరింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై ఇప్పటికే నలుగురు సభ్యుల కమిటీని నియమించింది.