హీరో విజయ్‌కు సీబీఐ నోటీసులు
posted on Jan 6, 2026 2:05PM
.webp)
తమిళనాడు కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్ స్టార్ హీరో విజయ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న టీవీకే సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే ఈ నెల 12న ఢిల్లీ సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని తెలిపింది. టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆధ్వర్యంలో వేలుసామిపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది.
ఈ సందర్భంగా ఆయను చూసేందుకు ఫ్యాన్స్, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో సుమారు 41 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అయితే, ప్రారంభంలో స్థానిక పోలీసులు ఈ కేసును విచారించినప్పటికీ, బాధితులకు న్యాయం జరగాలంటే స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్లు వచ్చాయి. గతేడాది అక్టోబర్‌లో ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అలాగే, విచారణను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు.