సునీల్ జాక్ పాట్.. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా చెల్లి

 

సునీల్ కమెడియన్ గా చిత్రపరిశ్రమకు పరిచయమయ్యి ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకులను నవ్వించాడు. తరువాత హీరోగా మారి ఎన్నో వైవిద్యమైన పాత్రల‌లో నటించాడు. ఆ తరువాత జక్కన్న రాజమౌళి డైరెక్షన్ లో నటించే ఛాన్స్ కొట్టేసి మర్యాద రామన్న చిత్రంలో నటించి హిట్ అందుకున్నాడు. అనంతరం పలు సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే కొన్నిరోజులుగా గ్యాప్ తీసుకున్న సునీల్ ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సునీల్ క‌థానాయ‌కుడిగా, ర‌క్ష ఫేమ్ వంశి కృష్ణ ఆకేళ్ళ ద‌ర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లి మ‌న్నార్ చోప్రాతో జతకట్టే జాక్ పాట్ కొట్టేశాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu