హీరోతో ఏపీ ఒప్పందం

 

ఆంధ్రప్రదేశ్‌లో హీరో పరిశ్రమ ఏర్పాటుచేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో హీరో మోటార్ సంస్థ మంగళవారం నాడు ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ ప్రతినిధి రాకేష్ వశిష్ఠతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు 18 నెలలలో ఆంధ్రప్రదేశ్‌లో హీరో తన పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది. ఈ పరిశ్రమ ద్వారా 10 వేల మందికి ఉపాధి లభించనుంది. హీరో సంస్థ వీలైనంత త్వరగా పరిశ్రమ ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu