ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం
posted on Jul 31, 2025 9:57AM

ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. ఇక్కడ వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో బ్యారేజీ వద్ద కృష్ణానది పోటెత్తుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 55 గేట్లను ఒక అడుగు మేర, మరో 15 గేట్లను రెండడుగుల మేర ఎత్తి దిగువకు 60 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
బ్యారేజీ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.54 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాగా వరద కారణంగా విజయవాడ నగరంలో ముంపునకు గురయ్యే 43 లోతట్లు ప్రాంతాలను గుర్తించిన అధికారులు అక్కడి వారిని అప్రమత్తం చేశారు. అలాగే కృష్ణా నదీ పరీవాహక ప్రాంత, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.